శనివారాల్లోనూ పనిచేయనున్న వైద్య పరీక్షా కేంద్రాలు

- April 23, 2022 , by Maagulf
శనివారాల్లోనూ పనిచేయనున్న వైద్య పరీక్షా కేంద్రాలు

కువైట్: షువైఖ్, సభన్, జహ్రా, అలీ సబా అల్-సలేం కేంద్రాలలో ప్రవాసుల కోసం వైద్య పరీక్షా కేంద్రాలు ఏప్రిల్ 23-30వ తేదీల మధ్య ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈద్ అల్-ఫితర్ సెలవుకంటే ముందు పెండింగ్‌లో ఉన్న ప్రవాసుల వైద్య పరీక్షలను వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అంతకుముందు అత్యధిక సంఖ్యలో సందర్శకులకు వసతి కల్పించడానికి మంత్రిత్వ శాఖ వారం రోజుల కిందట ప్రవాస కార్మికుల కోసం పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ లో వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com