తిరుమల: ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం
- April 23, 2022
తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ మధ్య వరుస వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సర్వదర్శనం టికెట్స్ విషయంలో జరిగిన తప్పిదం విమర్శల పాలు చేయగా..తాజాగా ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం కావడం భక్తులను షాక్ కు గురిచేసింది.
తిరుమలలోని ఓ వ్యాపార సముదాయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య తదితరుల భక్తిగీతాలతో మార్మోగే తిరుమల కొండపై సినిమా పాటలు ప్రసారం కావడంతో భక్తులు విస్తుపోయారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. సినిమా పాటల దృశ్యాల వెనుక గోవింద నామాలు ప్రసారం కావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. మరి ఈ ఘటన పట్ల టీటీడీ ఏ సమాధానం చెపుతుందో చూడాలి.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







