రక్షణ అవసరాల కోసం రష్యాపై భారత్ ఆధారపడొద్దు: పెంటగాన్
- April 23, 2022
వాషింగ్టన్: భారత్, రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ అభిప్రాయపడింది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని, దీంట్లో తమకు ఎటువంటి ఉద్దేశం లేదని, కానీ ఆ అంశాన్ని ప్రోత్సహించమని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపారు.
భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని, అమెరికా-ఇండియా మధ్య బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్ అని, ఆ విషయాన్ని గుర్తిస్తామని అన్నారు. 2018లో ట్రంప్ సర్కార్ నిరాకరించినా.. ఇండియా మాత్రం రష్యా నుంచి ఎస్-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎస్-400 మిస్సైళ్లు కొన్న టర్కీపై అమెరికా నిషేధం విధించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







