ఒమన్ లో 18 కొత్త పెట్టుబడి అవకాశాలు
- April 24, 2022ఒమన్:పర్యాటకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగాలలో పద్దెనిమిది కొత్త పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఆదివారం వెల్లడించనుంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో జరిగే ఈ ఈవెంట్‌ను హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం బిన్ మహ్మద్ అల్ మహ్రూఖీ స్పాన్సర్ చేయనున్నారు. ASAAS (మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ), ఒమ్రాన్ (ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ), ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలను నిర్వహించారు. ఆర్థిక పెట్టుబడుల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడం, పెట్టుబడిదారులకు సరైన వాతావరణాన్ని సృష్టించడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు సాధికారత, ప్రోత్సాహం అందించడం, ఎఫ్‌డిఐని పెంచడానికి ఒమన్‌ను పెట్టుబడి గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడి అవకాశాలను ‘ఇన్వెస్ట్ ఇన్ ఒమన్’ వేదిక ద్వారా తెలిపే ఏర్పాట్లు చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్