మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు
- April 24, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమిరేట్స్ విజన్ నివేదిక ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న బస్సు మదీనాలోని అల్ హిజ్రా హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మదీనా ఇతర సహాయక సేవల నుండి 20 అంబులెన్స్ లు, అధునాతన కేర్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మదీనా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ యుతమాహ్ పట్టణం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా ప్రావిన్సులను కలిపే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







