యూఏఈలో రమదాన్ తోఫా పంపిణీ

- April 24, 2022 , by Maagulf
యూఏఈలో రమదాన్ తోఫా పంపిణీ

యూఏఈ: దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా 2,000 మందికి నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా,రస్ అల్ ఖైమా లోని తెలుగు తరంగిణి వారితో కలిసి సంయుక్తంగా తెలుగు అసోసియేషన్ బృందం అల్ హమ్రా నందు గల లేబర్ క్యాంపులకు వెళ్లి ఏప్రిల్ 23న నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రణాళికలను ఉభయ సంస్థల అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్,వక్కలగడ్డ వెంకట సురేశ్ తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని రవి వూట్నూరి,సుంకు సాయి ప్రకాష్,దిరిశాల దుర్గా ప్రసాద్,అనురాధ వొబ్బిలిశెట్టి,తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి బృంద సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి గ్రాసరీ వితరణ ఏప్రిల్ 24 తేదిలో చేపట్టనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com