చైనీయుల టూరిస్టు వీసాలు రద్దు చేసిన భారత్
- April 24, 2022
న్యూ ఢిల్లీ: భారత విద్యార్థుల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరికి భారత్ ధీటైన జవాబిచ్చింది. చైనీయులకు మంజూరు చేసిన టూరిస్టు వీసాలను భారత్ రద్దు చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వైమానిక సేవల పర్యవేక్షణ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ)’ తన సభ్యులకు తెలిపింది. ఐఏటీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రవాణా సేవలు అందించే పలు విమానయాన సంస్థలు ఉన్నాయి. చైనీయులకు భారత్ టూరిస్టు వీసాలను రద్దు చేసినట్లు ఐఏటీఏ తమకు అనుబంధంగా ఉన్న విమాన సంస్థలకు తెలిపింది.
ఈ నెల 20న విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయాలు వెల్లడించింది. రిపబ్లిక్ చైనాకు చెందిన పౌరులకు జారీ చేసిన టూరిస్టు వీసాలు చెల్లవని సర్క్యులర్‌లో పేర్కొంది. పదేళ్ల కాల పరిమితి కలిగిన టూరిస్టు వీసాలను కూడా భారత్ రద్దు చేసినట్లు తెలిపింది. భారత్, చైనా వీసాలు రద్దు చేయడం వెనుక చైనా అనుసరిస్తున్న వైఖరే కారణమని నిపుణులు భావిస్తున్నారు. రెండేళ్లక్రితం కరోనా ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో చదువుకుంటున్న దాదాపు 22,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఆ దేశం విడిచి ఇండియా తిరిగొచ్చారు. కరోనా నేపథ్యంలో, చైనా యూనివర్సిటీలు మూతపడటంతో ఇండియా వచ్చిన విద్యార్థులంతా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు.
వీళ్లంతా తిరిగి చైనా వెళ్లి చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని, దీనికి తగిన వీసాలు మంజూరు చేయాలని భారత్ ఎప్పట్నుంచో చైనాను కోరుతోంది.అయితే, ఈ విషయంలో చైనా స్పందించడం లేదు. ఏదో ఒక కారణం చెబుతూ సమాధానం దాటవేస్తోంది.దీంతో చైనాలో మధ్యలో చదువు మానేసి వచ్చిన విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.భారతీయ విద్యార్థులకు చైనా వీసాలు మంజూరు చేయకపోవడానికి నిరసనగానే, భారత్.. చైనీయుల టూరిస్టు వీసాలు రద్దు చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







