ఏంటో ఈసారి అస్సలు కలిసిరావట్లేదు..ఓటమిపై రోహిత్ శర్మ
- April 25, 2022
ముంబై : ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓడిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ పై ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను చెప్పారు. తమ ముందు లక్నో జట్టు ఉంచిన లక్ష్యం ఎక్కువేమీ కాదన్నాడు. అయితే తమ బ్యాటర్లు రాణించలేకపోయారని చెప్పాడు. వారు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టడం తమకు నష్టం తెచ్చిపెట్టిందన్నాడు.
తమ బ్యాటర్లలో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. లక్నో జట్టులోని బ్యాటర్లు అలాంటి బాధ్యత తీసుకున్నారని, దీంతో తమకు ఓటమి తప్పలేదన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉన్నప్పటికీ తమ బౌలర్లు మాత్రం బాగా రాణించారని పేర్కొన్నాడు. ఏమైనా, ఈ ఐపీఎల్ సీజన్ తమకు అస్సలు కలిసి రావడం లేదని.. ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అన్నాడు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







