16 యూట్యూబ్ చానళ్లను బ్యాన్ చేసిన భారత్
- April 25, 2022
న్యూఢిల్లీ: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న 16 యూట్యూబ్ న్యూస్ చానళ్లను బ్యాన్ చేస్తున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.ఇందులో పది యూట్యూబ్ చానళ్లు ఇండియాకు సంబంధించినవి కాగా ఆరు యూట్యూబ్ చానళ్లు పాకిస్తాన్‌కు సంబంధించినవి తెలిపారు. ప్రస్తుతం బ్యాన్ చేయబడిన యూట్యూబ్ చానళ్ల వివర్షిప్ 68 కోట్లు ఉందని, అయితే వీరు యూట్యూబ్ వేదికను భారత్‌లో భయాందోలనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని పాడు చేయడానికి, అలాగే ప్రజా జీవినానికి ఇబ్బందికలేగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు మరొక ఫేస్బుక్ ఖాతాను కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది. కొవిడ్ సమయంలో భారత్‌లో లాక్‌డౌన్‌పై అనేక తప్పుడు కథనాల్ని ఈ యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరిగిందని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని అబద్దాలు ప్రచారం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
బ్యాన్ అయిన యూట్యూబ్ చానళ్ల వివరాలు...
భారత్ నుంచి:1.సైనీ ఎడ్యూకేషన్ రీసెర్చ్2. హిందీ మే దేఖో3.టెక్నికల్ యోగేంద్ర4. ఆజ్ తే న్యూస్5. ఎస్బీబీ న్యూస్6. డిఫెన్స్ న్యూస్ 24X77.ది స్టడీ టైమ్స్8. లేటెస్ట్ లప్డేట్9. ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్10. తాహాఫుజ్ ఏ దీన్ ఇండియా
పాకిస్తాన్ నుంచి:1.ఆజ్‌తక్ పాకిస్తాన్2. డిస్కవర్ పాయింట్3. రియాలిటీ చెక్స్4. కైసర్ ఖాన్5. ది వాయిస్ ఆఫ్ ఏషియా6. బోల్ మీడియా బోల్
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







