'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ టాలీవుడ్ ....సరికొత్త రికార్డ్
- April 26, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన 'సర్కారు వారి పాట' ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట ఇప్పుడు టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.
కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ వీడియోస్ లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ కళావతి పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించగా సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
కళావతి పాటతో పాటు పెన్నీ, సర్కారు వారి టైటిల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట నుంచి మాస్ సాంగ్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
తాజా వార్తలు
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







