జాబ్ వీసా రెన్యువల్ ఫీజు పెంపు ప్రతిపాదన
- April 05, 2016
వీసా రుసుముల పెంపులో వలసదారుల కుటుంబాలు, హౌస్‌మెయిడ్ వీసా మరియు డ్రైవర్స్‌ను పొందుపరిచే ప్రతిపాదన ఏదీ వీసా రెన్యువల్ ఫీ ప్రపోజల్లో లేదని మజ్లిస్ అల్ సురా మెంబర్ చెప్పారు. జాబ్ వీసాలకు మాత్రమే రెన్యువల్ పీజు వర్తించేలా ప్రపోజల్ పెట్టబడిందని ఆయన వివరించారు అల్ ఉరా మెంబర్ తాఫిక్ అల్ లవాతి. జాబ్ వీసా రెన్యువల్ కోసం గ్రాస్ సేలరీలో మూడు శాతం లేదా, 300 ఒమన్ రియాల్స్ వసూలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది ఇంతకు ముందు 200 ఒమన్ రియాల్స్‌గా ఉంది. అయితే ఈ ఆలోచన తమకు షాక్ కలిగిస్తోందని వలసదారులు అంటున్నారు. ఒమన్‌లో ప్రస్తుతం 1,990,294 మంది వలసదారులున్నారు. 200 ఒమన్ రియాల్స్ వీసా రెన్యువల్ ఫీజుని లెక్క కడితే, 398,058, 800 ఒమన్ రియాల్స్ అవుతుంది. ఈ నిర్ణయంతో చాలామంది ఒమన్‌ని విడిచి వెళ్లడానికే మొగ్గు చూపుతారని వలసదారుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







