యూరోపియన్ యూనియన్‌కు విదేశాంగ మంత్రి చురకలు
- April 27, 2022
న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు.రష్యా–యుక్రెయిన్ యుద్ధం పై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు. ఆసియాలో నిబంధనల ఆధారంగా రూపొందించిన కార్యాచరణలు ముప్పుకు గురైనపుడు, ఇతర దేశాల నుంచి భారత్ ఎదుర్కొన్న ప్రతి సవాళ్ళను పరిష్కరించడానికి యురోపియన్ దేశాలు ముందుకు రాలేదని, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని పౌర సమాజం ముప్పుకు గురైనప్పుడు కూడా యూరోప్ దేశాలు భాద్యతగా వ్యవహరించలేదని ఎస్.జైశంకర్ నిర్మొహమాటంగా విమర్శించారు.
ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు అఫ్గానిస్తాన్ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయని మరియు ఆసియాలో ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో సలహా కోరిన భారత్ కు యూరోప్ దేశాలు మొండిచేయి చూపాయని ఆయన అన్నారు. ఆ సమయంలోనూ యూరప్ తో భారత్ మరింత వాణిజ్యం చేయాలనే సలహానే యూరోప్ దేశాలు సూచించాయని, కానీ మేము మీకు కనీసం ఆ సలహా కూడా ఇవ్వడం లేదని ఎస్.జైశంకర్ చురకలంటించారు. అఫ్గానిస్తాన్ లో ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు ప్రపంచంలోని ఏ దేశం అక్కడ ఏమిచేసిందో తమకు చెప్పాలని ఆయన నిలదీశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







