మే 2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
- April 28, 2022
న్యూ ఢిల్లీ: మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సంవత్సరంలో ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే. మొదట ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రధాని డెన్మార్క్ వెలుతారు. తిరుగుప్రయాణంలో మే 4న ప్యారిస్‌కు చేరుకోనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ.. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. వాణిజ్యవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్ హగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న రెండవ ఇండియా నార్దిక్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధాన మంత్రుల తో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







