ఏపీ: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 11 మంది టీచర్లు అరెస్ట్

- April 28, 2022 , by Maagulf
ఏపీ: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 11 మంది టీచర్లు అరెస్ట్

అమరావతి: ఆంధప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ వ్యవహారం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. బుధవారం పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే 9.57కి వాట్సాప్‌ గ్రూప్‌లలో క్వశ్చన్‌ పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌లో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు.

కాగా ఈ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో 12 మంది అరెస్ట్ చేసారు. లీక్ ప్రధాన సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లు అరెస్ట్ చేసారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని నంద్యాల కలెక్టర్ తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తాసిల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారుల విచారణ చేపట్టామన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత సిఆర్‌పి రాజేష్ తన మొబైల్‌తో ఫోటో తీసి సమాధానాల కోసం బయట వేచివున్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేసాడని వెల్లడించారు నంద్యాల కలెక్టర్. మాల్ ప్రాక్టీస్ చేసిన రాజేష్ తో పాటు 11 మంది టీచర్లు కూడా అరెస్ట్ చేసామని.. తెలుగు పండితులు నీలకంటేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నా అభాధ్యతారహితంగా ప్రవర్తించిన చీఫ్ సూపర్నెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ నలుగురిని సస్పెండ్ చేసామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com