వీసా ఆన్ అరైవల్‌పై మలేషియా కీలక నిర్ణయం
- April 29, 2022
కౌలాలంపూర్: భారత ప్రయాణికులకు మలేషియా తీపి కబురు చెప్పింది. వీసా ఆన్ అరైవల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. వీసాల జారీ నిలిపివేయడంతోపాటు విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. మలేషియా కూడా ఇదే పద్ధతి కొనసాగించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. మలేషియా కూడా ఏప్రిల్ 1 నుంచి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిసారించిన ఆ దేశ ప్రభుత్వం.. టూరిస్ట్‌లను ఆకర్షించడం ద్వారా తిరిగి బలపడాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత టూరిస్ట్‌లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. వీసా ఆన్ అరైవల్ సర్వీసును తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే భారత ప్రయాణికులకు ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని మలేషియాస్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ డైరెక్టర్ మనోహరన్ పెరియస్వామి ఓ ప్రకటనలో చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం







