శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా నటించిన ‘భళా తందనాన’ మే 6న విడుదల

- April 29, 2022 , by Maagulf
శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా నటించిన  ‘భళా తందనాన’ మే 6న విడుదల

 హైదరాబాద్:   ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.  బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.  

తారాగణం: శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత - రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలనచిత్రం
సంగీతం - మణిశర్మ
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
డీవోపీ - సురేష్ రగుతు
స్టంట్స్: పీటర్ హెయిన్
ఆర్ట్ - గాంధీ నడికుడికార్
రచన - శ్రీకాంత్ విస్సా
పీఆర్వో: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com