వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు ఏడాది జైలు, అర మిలియన్ జరిమానా

- April 30, 2022 , by Maagulf
వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు ఏడాది జైలు, అర మిలియన్ జరిమానా

రియాద్: వ్యక్తిగత జీవితం పవిత్రతను ఉల్లంఘించవద్దని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని పౌరులు, నివాసితులు తమ గోప్యత హక్కును పరిరక్షించే షరియా, ఇతర చట్టాల ద్వారా కల్పించిన హక్కులు, హామీలను కలిగి ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది.  ఎవరైనా దానిని ఉల్లంఘించి, ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించినట్లయితే చట్టం ప్రకారం చర్యలు తప్పవని  హెచ్చరించింది. వ్యక్తుల గోప్యతకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరికైనా ఒక సంవత్సరం జైలు శిక్ష, SR500,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. డిజిటల్ పరికరాలు, కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్‌ల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను గోప్యతా ఉల్లంఘనల కిందకు వస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com