యాదగిరిగుట్ట పై కొత్త పార్కింగ్ ఫీజులు..

- May 01, 2022 , by Maagulf
యాదగిరిగుట్ట పై కొత్త పార్కింగ్ ఫీజులు..

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే సొంత వాహనాల్లో నేరుగా కొండపైకి వెళ్లాలనుకునే వారికోసం తాజాగా అనుమతి ఇచ్చిన అధికారులు... పార్కింగ్ ఫీజు మాత్రం కళ్లుచెదిరేలా నిర్ణయించారు. యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల పార్కింగ్‌ కోసం కొండపై ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు, వీఐపీలు,దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com