ఈ నెల 4 నుంచి అమెజాన్ సమ్మర్ సేల్
- May 01, 2022
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం అమెజాన్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ నెల 4 నుంచి సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. మూడు బ్యాంకులకు చెందిన కార్డులపై పదిశాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఆర్‌బిఎల్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పదిశాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఫ్రీ, ఫాస్ట్ డెలివరీ అందించనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ప్లాట్‌ఫాంపై మొదటిసారి కొనుగోల చేసేవాళ్లకు అదనంగా పదిశాతం డిస్కౌంట్ కూడా అందించనుంది. ఈ సేల్ సందర్భంగా 60కిపైగా కొత్త ఉత్పత్తుల్నిలాంఛ్ చేయనుంది.
ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌తోపాటు హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, బుక్స్, టాయ్స్ వంటి అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు అందించనుంది. మొబైల్స్‌కు సంబంధించి ప్రధానంగా రెడ్‌మి 10ఏ ఫోన్ రూ.8,499లకే రానుంది. అలాగే రియల్‌మి నర్జో 50ఏ ప్రైమ్ మొబైల్ రూ.11,499లకు, కిండిల్ రూ.6,799లకు, అమెజాన్ ఎకో షో రూ.4,499లకు, వీయూ 32 అంగుళాల ప్రీమియమ్ టీవీ రూ.11,999లకే సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు పలు ఉత్పత్తులపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా స్పెషల్ సేల్ తీసుకొస్తోంది. అమెజాన్ కంటే ఒకరోజు ముందుగా.. అంటే ఈ నెల 3 నుంచే ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ నెల 3 అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే సేల్ ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై పదిశాతం డిస్కౌంట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







