రానా దగ్గుబాటి సమర్పకుడిగా తెలుుగలో రిలీజ్ అవుతోన్న మూవీ ‘ఛార్లి 777’
- May 01, 2022
హైదరాబాద్: అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలవుతుంది.
ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందలు పడినప్పుడు ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది. చివరకు ఏం జరిగిందనే విషయాలను 777 ఛార్లి అనే అడ్వెంచరస్ కామెడీలో చూపించబోతున్నారు. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు.
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే మలయాళంలో నటుడు, నిర్మాత పృథ్వీ రాజ్ సుకుమారన్, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







