యూరప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ
- May 02, 2022
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షాల్జ్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, డెన్మార్క్ ప్రధాని మెటె ఫెడరిక్సన్‌తో భేటీ అవుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలను గురించి చర్చించనున్నారు.
డెన్మార్క్‌లోని కోపెన్‌హేగన్‌లో జరుగనున్న భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. మొత్తంగా ప్రధాని మోదీ తన మూడు పర్యటనలో భాగంగా 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలతోపాటు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ యూరప్‌లో పర్యటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రష్యా చర్యలను బహిరంగంగా ఖండించడానికి భారతదేశం విముఖత చూపించన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి







