ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు: మంత్రిత్వ శాఖ
- May 02, 2022
కువైట్: ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులపై ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన అన్ని కేసులను పర్యవేక్షించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ హోదాను కాపాడేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ మాట్లాడుతూ.. మీడియా, భద్రతా అధికారుల సమన్వయంతో ఈ కేసులను పర్యవేక్షించాలని, అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత అధికారులకు వాటిని రిఫర్ చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మీడియాతో కలిసి సమన్వయంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని మురాద్ వివరించారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







