ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవదహనం
- May 02, 2022
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదంలో సంభవించింది.ఈఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దాంట్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
మొత్తం 80 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. క్వీజన్ సిటీలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న బస్తీలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోని రెండవ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు రెండు గంటల సమయం పట్టినట్లు సీనియర్ ఫైర్ ఆఫీసర్ గ్రెగ్ బిచ్‌యాదా తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడం వల్ల ప్రజలు తప్పించుకునేందుకు ఇబ్బందిపడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







