ఈద్ నేపథ్యంలో తన మనవడికి షేక్ మొహమ్మద్ అందించిన శుభాకాంక్షలు వైరల్

- May 04, 2022 , by Maagulf
ఈద్ నేపథ్యంలో తన మనవడికి షేక్ మొహమ్మద్ అందించిన శుభాకాంక్షలు వైరల్

దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన మనవడికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. చిన్నారి తల్లి షేకా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ వీడియో విడుదల చేశారు. చిన్నారి మొహమ్మద్ బిన్ ఫైసల్ బిన్ సౌద్ అల్ కాసిమి, షేక్ మొహమ్మద్ వైపు శుభాకాంక్షలు చెప్పేందుకు పరిగెత్తడం వీడియోలో కనిపించింది. షేక్ మొహమ్మద్ ఆ చిన్నారిని ఆత్మీయంగా కౌగలించుకున్నారు. షేక్ ఫైసల్ బిన్ సౌద్ అల్ కాసిమి తనయుడు ఆ చిన్నారు. నెటిజన్లు ఈ వీడియో పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com