‘ఈ–గ్యాలెరియా’ను ప్రారంభించిన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో
- May 04, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నగర టెక్నాలజీ డీఎన్‌ఏకు అనుగుణంగా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ తమ హైటెక్ సిటీ మాల్‌ను ‘ఈ–గ్యాలెరియా’గా పునః ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి మరియు ఎక్స్‌క్లూజివ్ ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీ మాల్‌గా హైటెక్ సిటీ హైదరాబాద్ వద్ద దీనిని పూర్తి సరికొత్త అవతార్‌లో తీర్చిదిద్దింది. నగరపు ఐటీ కేంద్రం నడిబొడ్డున ఉన్న ఈ–గ్యాలెరియా, టెక్నాలజీ ప్రేమికులైన నగర వాసుల సాంకేతికావసరాలను తీర్చే ఏకీకృత కేంద్రంగా నిలువనుంది.
ఆకర్షణీయమైన స్కైవాక్‌తో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌కు అనుసంధానితమైన ఈ–గ్యాలెరియా, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన టెక్ అనుభవాలను మాల్‌లోని ప్రాంగణాలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక లీజింగ్‌కు అందిస్తుంది. టెక్ టాక్స్, రోడ్ షోలు, ఉత్పత్తి ఆవిష్కరణలు నిలయంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. వినోదాత్మకమైన, అనుసంధానిత వాతావరణంలో సాంకేతికత రంగంలో వస్తోన్న మార్పులను గురించి ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ –సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధి కోసం మా వృద్ధి ప్రణాళికలలో భాగంగా ఈ–గ్యాలెరియాను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. నేడు, బ్రాండ్లన్నీ కూడా నూతన మార్కెటింగ్ ప్రాంగణాల కోసం వెదుకుతుండటంతో పాటుగా వినూత్నమైన ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్స్ కోసం చూస్తున్నాయి. ఈ అవసరాలన్నీ తీర్చే ఒన్ స్టాప్ కేంద్రంగా ఈ–గ్యాలెరియా నిలువనుంది. ఈ నూతన అవతార్ బ్రాండ్‌ల మద్దతు మరియు లాయల్టీ వినియోగించుకోవడంలో మాకు సహాయపడటంతో పాటుగా వ్యాపార సంస్ధలు మరియు హైదరాబాద్ నగరం కలిసి ఎదగడానికి మరియు స్థిరమైన ఉజ్వల భవిష్యత్‌ను అభివృద్ధి చేయడానికి మాకు అవకాశాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.
_1651672053.jpg)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







