రాహుల్‌ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణ

- May 04, 2022 , by Maagulf
రాహుల్‌ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేయడం జరిగిపోయాయి.. ఇదే సమయంలో ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్‌ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరారు పిటిషనర్స్‌.. అయితే, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు సింగ్ బెంచ్.. ఇక, హైకోర్టు సింగిల్ బెంచ్ అదేశం ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోన్న అనుమతి నిరాకరణ.. అయితే, పెట్టుకున్న దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. కాగా, రాహుల్ గాంధీ ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుండగా.. 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com