తనలా బతకాలనుకుంటే ఆ మూడు వదిలేయాలి: ఆర్జీవీ
- May 04, 2022
హైదరాబాద్: తనలా బతకాలనుకుంటే దైవం, సమాజం, ఫ్యామిలీ వదిలేయాలని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆయన తెరకెక్కించిన 'మా ఇష్టం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్స్.. నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి 'ఆలీతో సరదాగా' పాల్గొని సందడి చేశారు వర్మ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్‌లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







