రేపు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ
- May 05, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజల పర్యటనలో భాగంగా రేపు (శుక్రవారం) ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు.
మరుసటి రోజైన శనివారం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో రాహుల్ ఫొటోలు దిగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో హైదరాబాద్‌లో ఆయన పర్యటన ముగుస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







