మావోయిస్టు దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గింది: ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్

- May 06, 2022 , by Maagulf
మావోయిస్టు దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గింది: ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్​ల దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని.. ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల కృష్ణా, కిల్లో రాజు, మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు. 

గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్​శాఖ అండగా ఉంటుందని.. మావోయిస్టులపై ఉన్న రివార్డ్​ను వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉందన్నారు.గాలికొండ ,పేద బయలు, కోరుకొండ ఏరియాలో ఇంకా మావోయిస్టు కమిటీలు ఉన్నాయని.. గతంలో కంటే ప్రస్తుతం వారి ప్రభావం తగ్గిందన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ నిరంతరం కొనసాగుతుందని..వీరిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com