మైఖేల్ లుక్‌లో సందీప్ కిషన్!

- May 07, 2022 , by Maagulf
మైఖేల్ లుక్‌లో సందీప్ కిషన్!

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ కిషన్ చేస్తున్న మూవీ ‘మైఖేల్’. తొలిసారి కెరీర్‌లో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జెయకోడి తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.

అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫెరోషియస్ లుక్‌లో సందీప్ కిషన్ ఈ పోస్టర్‌‌లో మనకు కనిపించాడు. ఈ సినిమాలో పలువురు స్టార్ యాక్టర్స్ పనిచేస్తుండటంతో మైఖేల్ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ మీనన్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ దివ్యాంశ కౌషిక్ ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటిస్తోంది.

అంతేగాక ఈ సినిమాలో వర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేష్‌లు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడిచింది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మైఖేల్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సందీప్ కిషన్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com