ఇండోర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..
- May 07, 2022
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఇండోర్‌లో రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి.ప్రమాదం దాటికి అక్కడున్న వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పలువురికి గాయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని విజయనగర్ ప్రాంతం స్వర్న్‌బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం ఇషాక్ పటేల్ ఇల్లు అని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నవారే. శనివారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే పెద్ద శబ్దాలు, కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాఢనిద్రలో ఉండగానే మంటల్లో సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిని ఆశిష్, ఆకాంక్ష, గౌరవ్, నీతు సిపోడియాగా గుర్తించగా, మిగిలిన వారు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వారిలో ఫిరోజ్, మునీరా, విశాల్, హర్షద్, సోనాలీలు ఉన్నారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







