దుబాయ్‌లో ఘనంగా ఠాగూర్ 161వ జయంతి ఉత్సవాలు

- May 08, 2022 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా ఠాగూర్ 161వ జయంతి ఉత్సవాలు

దుబాయ్‌: రవీంద్రనాథ్ ఠాగూర్ 161వ జయంతిని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'ఠాగూర్ బియాండ్ హారిజోన్' అనే ఆల్బమ్‌లోని 3 ఐకానిక్ పాటలను విడుదల చేశారు. ఠాగూర్ రాసిన మూడు పాటలను అరబిక్‌లోకి అనువదించి అందించడం ఇదే తొలిసారి. ప్రముఖ ఎమిరాతి కవి డాక్టర్ షిహాబ్ ఘనేమ్ వీటిని అనువాదం చేశారు.దేవ్ చక్రవర్తి పాటలకు స్వరాలను అందించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ సుచేత సతీష్ అరబిక్ లో గానం చేశారు. భారత కాన్సులేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అమన్ పూరి ఈ పాటలను విడుదల చేశారు. కాన్సుల్ ఫర్ కల్చర్ తాడు మాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ ఘనేమ్, దేవ్, సుచేత త్రయం ఇప్పటికే ఠాగూర్ పాటలను అరబిక్‌లోకి అనువదించే ప్రాజెక్టుపై పని చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో యూఏఈ, ఇండియా నుండి ప్రముఖ వ్యక్తులు మరియు ఇండియన్ పీపుల్స్ ఫోరంకు సంబంధించిన ప్రదీప్ మురళి,సుమీత, కుంభాల మహేందర్ రెడ్డి, శివ కుమార్ మరియు ఇండియన్ కౌన్సిల్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com