ప్రవాసులకు శుభవార్త చెప్పిన కువైట్
- May 08, 2022
కువైట్ సిటీ: ఫ్యామిలీ విజిట్ వీసా ల విషయంలో ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని నేటి నుంచి తిరిగి ప్రారంభించింది.ఈద్ కు ముందు ఆ దేశ మంత్రి మండలి కరోనాకు సంబంధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడంతో ప్రవాసుల నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల దరఖాస్తులకు మార్గం సుగమైంది.ఈ నేపథ్యంలోనే గత నెలలో రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ నేటి నుంచి ఈ వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.అన్నట్టుగానే ఇవాళ్టి నుంచి వీసాల జారీ ప్రారంభించింది.ఇక ఈ వీసాల కోసం ప్రవాసులు దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకుముందు ఉన్న షరతులే వర్తించనున్నాయి.జాతీయత, వేతన పరిమితి, సెక్యురిటీ చెక్స్ తదితర విషయాల్లో పాత నియమాలే వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఫ్యామిలీ వీసాకు ల వివరాలు..ప్రవాసుడి భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ విజిట్ వీసా లు జారీ చేస్తారు.వర్క్ పర్మిట్‌లో 500KDలు ఉన్నవారికి ఫ్యామిలీ వీసా మంజూరు చేయడం జరుగుతుంది.ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు ప్రస్తుతం 53 దేశాల వారికి జారీ చేస్తున్నారు.ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







