ఐపీఎల్ 2022: హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్
- May 08, 2022
ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.హైదరాబాద్ ముందు 193 పరుగులు భారీ లక్ష్యం నిర్దేశించింది.
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ 50 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది. కాగా, విరాట్ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరించాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో జగదీశ్ సుచిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







