సినీ నటిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్
- May 08, 2022
హైదరాబాద్: తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి చెందిన ఒక నటిని వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.స్టార్ మేకర్స్ యాప్ ద్వారా నటి ఫోన్ నెంబరు సంపాదించిన యువకుడు నటి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఆమెను బెదిరించసాగాడు.
వాట్సప్ చాటింగ్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి ఆమెను దూషించసాగాడు.దీంతో భయపడిపోయిన ఆ నటి షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకుంది. చివరికి ధైర్యం చేసి హైదరాబాద్ షీ టీమ్స్ వారికి ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ షీ టీమ్స్ పోలీసులు రంగంలోకి దిగారు.నటికి వస్తున్న ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.రాయదుర్గం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







