సర్కారు వారి పాట: 'ప్లస్’ లు ఏంటీ.? 'మైనస్' లు ఏంటీ.?
- May 10, 2022సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ’సర్కారు వారి పాట‘ సినిమా రిలీజ్‌కి రెడీగా వున్న సంగతి తెలిసిందే. మే 12న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు హోరెత్తిపోతున్నాయ్. ఓ పక్క సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, ఆయన ముద్దుల తనయ సితార కూడా ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, దాదాపు 130 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. ప్రోమోల పరంగా ప్రీ రిలీజ్ బజ్ చాలా చాలా పాజిటివ్‌గా వుంది. ‘కళావతి’ సాంగ్ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎట్రాక్ట్ అవుతున్నారీ సాంగ్‌కి.
‘పెన్నీ సాంగ్’ తీసుకుంటే, క్యూట్ క్యూట్‌గా పిల్లల్ని ఎట్రాక్ట్ చేసింది ఈ సాంగ్. అలాగే, యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయ్. అన్ని వర్గాల ఆడియన్స్‌నీ రిలీజ్‌కి ముందే ఇంతలా ఎట్రాక్ట్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో వచ్చింది లేదు.
అయినా కానీ, ఆడియన్స్ ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయ్. ‘పుష్ప’, కేజీఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలా పెద్ద సినిమాలు ఈ మధ్య చాలానే రిలీజయ్యాయ్. దాంతో పాటే ఇటీవల వచ్చిన ‘ఆచార్య’ కూడా. కానీ, పై సినిమాలతో పోల్చితే, ‘ఆచార్య’ రిజల్ట్ ఏమంత బాగా లేదు.
సో, ఆయా సినిమాలతో ‘సర్కారు వారి పాట’కు ఖచ్చితంగా పోలిక వుంటుందనడంలో సందేహం లేదు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మరి, ఆ మైనస్‌ని అధిగమించి ‘సర్కారు వారి పాట’ అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం