ప్లాపులొచ్చినా పూజా హెగ్దేనే టాప్..
- May 10, 2022
ఒక్క హిట్టొస్తే చాలు స్టార్‌డమ్ కట్టబెట్టేస్తున్న రోజులివి. అలాగే, ఒక్క ఫ్లాప్ వచ్చిందా.. అంతే సంగతి కెరీర్ అటకెక్కేసిందంటూ ప్రచారం గుప్పుమంటున్న రోజులు కూడా. హీరో అయినా, హీరోయిన్ అయినా ఇద్దరూ సమానమే ఈ విషయంలో.. అలా తయారైంది సినిమా పరిస్థితి.
అయితే, బుట్టబొమ్మ పూజా హెగ్దే విషయంలో అలా జరగడం లేదు. నిన్న మొన్నటి వరకూ పూజా హెగ్దే నటించిందంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే.. అన్నట్లుండేది. కానీ, ఇప్పుడు వరుసగా మూడు ఫ్లాప్‌లు పూజా హెగ్దే నుంచి. తమిళంలో ‘బీస్ట్’, తెలుగులో ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు.
మూడూ భారీ ప్రాజెక్టులే. రిలీజ్‌కి ముందు భారీ అంచనాలున్న సినిమాలే.. కానీ, బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టేశాయ్. దాంతో ఇక పూజా హెగ్దే పనైపోయిందనుకున్నారంతా. కానీ, సీను మారలేదు. నెంబర్ వన్ ఛైర్ ఇంకా పూజా చేయి జారలేదు.
ప్రస్తుతం పూజా హెగ్దే చేతిలో చాలా సినిమాలున్నాయ్. తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్టులో పూజా హెగ్దేనే హీరోయిన్. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో మూవీ కూడా పూజా కోసమే ఎదురు చూస్తోంది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే రిలీజ్‌కి సిద్ధంగా వుంది ఈ సినిమా. ఈ లోపల ఇంకెన్ని ప్రాజెక్టులు బుట్టబొమ్మ ఖాతాలో పడతాయో చెప్పలేం. సో, ఓవరాల్‌గా బుట్టబొమ్మ లెక్కే వేరు. బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులొచ్చినా నెంబర్ వన్ ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్ కాలేదంతే. అందుకే పూజా, మేడమ్ సార్.. మేడమ్ అంతే.!
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







