రన్ వే మరమ్మత్తులు: అబుధాబి అల్ బతీన్ ఎయిర్‌పోర్టు మూసివేత
- May 10, 2022
అబుధాబి: అబుధాబిలోని అల్ బతీన్ ఎయిర్ పోర్టు, రన్ వే అప్‌గ్రేడ్స్ కోసం సుమారు రెండు నెలలపాటు మూసివేయబడుతుంది. ఈ విషయాన్ని అబుధాబి ఎయిర్ పోర్ట్స్ ప్రకటించింది. రన్ వే విస్తరణతో, భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మే 11 నుంచి జులై 20 వరకు నిర్వహణ పనులు జరుగుతాయి. కేవలం హెలికాప్టర్లను మాత్రమే ఈ సమయంలో ఎయిర్ పోర్టులో అనుమతిస్తారు. జులై 21 నుంచి పూర్తిస్థాయిలో విమానాల రాకపోకల పునరుద్ధరణ జరుగుతుంది. అల్ బతీన్ ఎయిర్ పోర్టు 1960లో ప్రారంభమైంది. అప్పట్లో ఇదే ప్రధాన విమానాశ్రయంగా వుండేది. ఆ తర్వాత కేవలం ప్రైవేటు విమానాలకు మాత్రమే పరిమితమయ్యింది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







