రన్ వే మరమ్మత్తులు: అబుధాబి అల్ బతీన్ ఎయిర్‌పోర్టు మూసివేత

- May 10, 2022 , by Maagulf
రన్ వే మరమ్మత్తులు: అబుధాబి అల్ బతీన్ ఎయిర్‌పోర్టు మూసివేత

అబుధాబి: అబుధాబిలోని అల్ బతీన్ ఎయిర్ పోర్టు, రన్ వే అప్‌గ్రేడ్స్ కోసం సుమారు రెండు నెలలపాటు మూసివేయబడుతుంది. ఈ విషయాన్ని అబుధాబి ఎయిర్ పోర్ట్స్ ప్రకటించింది. రన్ వే విస్తరణతో, భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మే 11 నుంచి జులై 20 వరకు నిర్వహణ పనులు జరుగుతాయి. కేవలం హెలికాప్టర్లను మాత్రమే ఈ సమయంలో ఎయిర్ పోర్టులో అనుమతిస్తారు. జులై 21 నుంచి పూర్తిస్థాయిలో విమానాల రాకపోకల పునరుద్ధరణ జరుగుతుంది. అల్ బతీన్ ఎయిర్ పోర్టు 1960లో ప్రారంభమైంది. అప్పట్లో ఇదే ప్రధాన విమానాశ్రయంగా వుండేది. ఆ తర్వాత కేవలం ప్రైవేటు విమానాలకు మాత్రమే పరిమితమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com