ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి.. ఉచితంగా కెరీర్ కోర్సులు
- May 10, 2022
ప్రముఖ ఐటీ దిగ్గజంటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గ్రాడ్యుయేట్స్‌కి శుభవార్త చెప్పింది.వారి కెరీర్‌కు ఎంతో ఊతమిచ్చేలా ఉచిత కోర్సులను అందించనుంది.ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది.ఈ కోర్సు ద్వారా పదిహేను రోజుల పాటు కెరీర్ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు.ఈ కోర్సు యువతకు ఎంతో ఉపయోగపడుతోందని సంస్థ పేర్కొంది.ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు.ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ పై ప్రత్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ రూపంలో కోర్సు అందిస్తున్నారు.
- అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముఖ్యంగా బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్,అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ పై కోర్సులో అందించనున్నారు.
- TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది.
- ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వ్యవధిలో వీడియోలు, ప్రెజెంటేషన్లు, రీడింగ్ మెటీరియల్ , టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబ్నార్లు అందిస్తుంది.
- అంతే కాకుండా విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహలు నివృత్తి చేసుకొనే అవకాశం ఇస్తున్నారు.
- ఈ కోర్స్‌ను విజయవంతంగా మొత్తం పూర్తి చేసిన తరువాత ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లను అందిస్తారు.
- అంతేకాకుండా, కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయవచ్చు.
ఏం నేర్చుకోవచ్చు..
- ఈ కోర్సులో అభ్యర్థికి బిహేవియరల్ స్కిల్స్ , వర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పుతారు.
- కమ్యూనికేషనల్ స్కిల్స్‌ఫై ప్రత్యేక క్లాస్ లు ఉంటాయి.
- మంచి రెస్యూమ్ తయారు చేసుకోవడానికి సాయం చేస్తారు.
- అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు.
- ఆర్టిఫిసియల్ ఇంటలిజన్స్ అంశాలను నేర్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
Step 1: ఇది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లె చేసుకోవాలి.
Step 2: కోర్సుకు సంబంధించి అధికారిక వెబ్సైట్ https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ను సందర్శించాలి.
Step 3: అక్కడ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
Step 4: ప్రతీ కోర్సు స్ట్రక్చర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.
తాజా వార్తలు
- బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్‌లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!









