బీడీఎల్ లో ఉద్యోగాలు
- May 10, 2022
హైదరాబాద్: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఏపి, తెలంగాణాలలోని వివిధ యూనిట్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు.కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈపోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. భర్త చేయనున్న పోస్టులకు సంబంధించి ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్లు, ప్రాజెక్టు అసిస్టెంట్లు 36 ఖాళీలు, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్లు 44 ఖాళీలు ఉన్నాయి.
ఎలక్ట్రికల్, టూల్ డిజైన్, హెచ్ ఆర్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్స్ వంటి విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి విభాగాల్లో ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతకు సంబంధించి పదోతరగతి , సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యేషన్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.సంబంధిత విభాగంలో ఏడాది కాలం అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు,పని అనుభవం,ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ మే 14, 2022 తేది నుండి ప్రారంభమై జూన్ 4, 2022 తేదితో ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://bdl-india.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







