మే 12 న ఏపీ కేబినెట్
- May 10, 2022
అమరావతి: ఈ నెల 12 న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది.గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వతేది ఉ.11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3గం.లకు మార్చారు.ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించి.. బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







