అసని తుపాను: తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం..ఆశ్చర్యంలో జనం
- May 11, 2022
బంగాళాఖాతంలో అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను ప్రభావానికి తీరప్రాంతమంతా అలజడిగా మారింది. తుపాను కారణంగా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు ఓ వింత రథం కొట్టుకొచ్చింది. అది చూడటానికి బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతోంది. సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఆ రథం విదేశానికి చెందినగా భావిస్తున్నారు.
ఈ వింతైన రథాన్ని చూసేందుకు అక్కడి ప్రాంతవాసులు భారీగా తరలివస్తున్నారు. కొట్టుకువచ్చిన వింతైన ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో పెను తుపానులు వచ్చాయని, ఎప్పుడూ కూడా ఇలాంటి రథం వంటి వింతైనవి కొట్టుకురాలేదంటున్నారు. ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ బంగారు రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ రథం ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







