జక్కన్న-మహేశ్ మూవీ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ - లీక్ చేసిన జక్కన్న ఫాదర్
- May 11, 2022
రీసెంట్ గా RRR సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి..నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
జనరల్ గా సినిమాకి సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకునే జక్కన్న..ఈసారి మాత్రం సినిమాను చాలా త్వరగానే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మనకు తెలిసిందే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. కానీ, మ్యాటర్ మాత్రం ఇంచు కూడా ముందుకు కదలడం లేదు.
ప్రజెంట్ సర్కారి వారి పాట సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న మహేష్.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక నెల గ్యాప్ తీసుకుని..తన నెక్స్ట్ సినిమా ని సెట్స్ పైకి ఎక్కించనున్నారట. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కి ఎక్కువ టై తీసుకోకుండా ఫాస్ట్ గా షెడ్యూల్స్ ఫినిష్ చేసి నవంబర్ లోపే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత మహేశ్ మరో నెల గ్యాప్ తీసుకుని..డైరెక్ట్ గా జక్కన్న సినిమా ను సెట్స్ పై ఎక్కిస్తాడట. వన్స్ సినిమా స్టార్ట్ అయ్యాక ఆ సినిమా షూటింగ్ రెండెళ్లు పడుతుందో.. మూడేళ్లు పడుతుందో ..ఆ దేవుడి కే తెలియలి.
ఇక ఈ సినిమా పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు జక్కన్న ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయేంద్ర ప్రసాద్ కు.. జక్కన్న-మహేశ్ మూవీపై ఓ ప్రశ్నఎదురైంది. దీనికి సమాధనం ఇస్తూ..'రాజమౌళి మహేశ్ తో తీసే సినిమా చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూడని కొత్త కధ ఇది.ఈ మూవీ సెట్‌పైకి వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సినిమా మెయిన్ లైన్ అడవి ని బేస్ చేసుకునే ఉంటుంది. షూటింగ్ కూడా అడవుల్లో నే తీయ్యాలని అనుకుంటున్నాం. ఖచ్చితం గా మహేశ్ కు ఇది ఓ మర్చిపోలేని సినిమా అవుతుంది'అంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. దీంతో సినిమా పై భారీ అంచానలను పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







