కెరీర్ ను మెరుగుపరిచే ఉచిత కోర్సులు అందించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
- May 11, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉచిత కోర్సులను అందించనుంది. ఇందు కోసం టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది.
అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు , ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదిహేను రోజుల పాటు కెరీర్ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ పై కోర్సులు అందించనున్నారు.
టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది. ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వ్యవధిలో వీడియోలు , ప్రెజెంటేషన్‌లు, రీడింగ్ మెటీరియల్ , టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబ్‌నార్‌లు అందిస్తుంది.దీంతోపాటుగా విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహలు నివృత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. బిహేవియరల్ స్కిల్స్ , వర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పుతారు. కమ్యూనికేషనల్ స్కిల్స్‌ఫై ప్రత్యేక క్లాస్‌లు ఉంటాయి. అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు. ఆర్టిఫిసియల్ ఇంటలిజన్స్ అంశాలను నేర్పిస్తారు. గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ పై పట్టు సాధించటం కోసం ఇంగ్లీష్‌పై ప్రత్యేక కోర్సు అందిస్తున్నారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ రూపంలో కోర్సు అందిస్తున్నారు.
కోర్స్‌ను విజయవంతంగా మొత్తం పూర్తి చేసిన తరువాత ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్‌లను అందిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







