మహేష్ ఇప్పుడెందుకు కెలుక్కున్నాడబ్బా.?
- May 11, 2022
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల ప్రశ్నలు ఆయన ముందుకొస్తున్నాయ్. అందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మహేష్ ముందుకొచ్చింది. బాలీవుడ్‌పై మహేష్ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు.? అనేది ఆ ప్రశ్న సారాంశం.
అందుకు మహేష్ బాబు సమాధానం ఏంటో తెలుసా.? బాలీవుడ్ నన్ను భరించలేదేమో అనే అభిప్రాయంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడం లేదు అని మహేష్ సమాధానమిచ్చారు. అయితే, ఈ ప్రశ్న అంతగా సమర్ధనీయంగా లేదనేది కొందరి అభిప్రాయం.
ఎందుకంటే, మహేష్ బాబు తదుపరి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీనే అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఎక్కువ. సో, ఆ రకంగా త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌కి వెళ్లబోతున్నారన్న మాట.
ఈ తరుణంలో మహేష్ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సబబు.? అంతేకాదు, నాకు తెలుగులో వున్న స్టార్డమ్, తెలుగు ప్రేక్షకుల అభిమానం చాలు.. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలే హిందీలో డబ్ అయ్యి రిలీజ్ అవుతాయ్.. అని కూడా ఆయన చెప్పారు. దాంతో మహేష్ అభిమానుల్లో కాస్త కలవరం మొదలైంది. ఈ టైమ్‌లో మహేష్ బాబు ఎందుకు కెలుక్కున్నాడబ్బా.! అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







