పవన్ కళ్యాణ్ సినిమాలకి ముంచుకొస్తున్న ప్రమాదం.!
- May 11, 2022రాజకీయాల్లో వేగం పెంచాలనే వుద్దేశ్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేకిచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఈ మధ్యనే సినిమాలపై ఫోకస్ పెట్టారాయన. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చిందే తడవుగా, వరుస పెట్టి సినిమాలను ఓకే చేసేశారు.
అలాగే, పూర్తయిన సినిమాల్ని పూర్తయినట్లే రిలీజ్ చేసేస్తున్నారు కూడా. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్లో బిజీగా వున్నారు. హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా వుంది.
అయితే, ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికల దిశగా అక్కడి రాజకీయ పరిస్థితులు జోరందుకుంటున్నాయ్. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాల పైనే పూర్తిగా ఫోకస్ పెడతారా.? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయ్.
తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు బ్రేకిస్తారంటూ ప్రచారం కూడా జోరందుకుంటోంది. అంతేకాదు, సెట్స్‌పై వున్న సినిమాలను సైతం మధ్యలోనే ఆపేస్తారట అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. అయితే, ఇదంతా ఉత్త ప్రచారమే.. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.. అంటూ పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రచారాలనేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారట కూడా.
అవును నిజమే, ఆయన పవన్ కళ్యాణ్. ఇటు సినిమాలనూ, అటు రాజకీయాలనూ రెండింటినీ పక్కాగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ