సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు

- May 15, 2024 , by Maagulf
సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు

రియాద్: కింగ్‌డమ్‌లోని లాంజ్‌లలో ప్రయాణీకులకు గరిష్ట కొనుగోలు పరిమితిని సౌదీ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (జాట్కా) నిర్దేశించింది.  అరైవింగ్ లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల నుండి గరిష్ట కొనుగోలు పరిమితి ఒక ప్రయాణీకుడికి SR3,000 అని పేర్కొంది.  ఆన్ గోయింగ్ లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల ఆపరేటర్లకు మంజూరు చేసిన లైసెన్సుల కొనసాగింపులో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు జాట్కా వెల్లడించింది. లాంజ్లలో డ్యూటీ-ఫ్రీ మార్కెట్ల ఆపరేటర్ల నియమాలు, నిబంధనలను  అథారిటీ సోషల్ మీడియా అకౌంట్లు, కస్టమ్స్ ద్వారా 24/7 పనిచేసే యూనిఫైడ్ కాల్ సెంటర్ నంబర్ 19993 ద్వారా సంప్రదించాలని సూచించింది.  [email protected], లేదా వెబ్‌సైట్ jatca.gov.sa లో లైవ్ చాట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపింది.  డ్యూటీ-ఫ్రీ మార్కెట్లు రాజ్యానికి వచ్చే ప్రయాణీకుల అనుభవాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతకుముందు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల ఏకీకృత కస్టమ్స్ వ్యవస్థకు అనుగుణంగా ఎయిర్, సీ మరియు ల్యాండ్ ఎంట్రీ పాయింట్ల వద్ద డ్యూటీ-ఫ్రీ మార్కెట్లను స్థాపించే కస్టమ్స్ నియమాలు, షరతులు మరియు విధానాలను అథారిటీ జారీ చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com