మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!

- May 15, 2024 , by Maagulf
మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!

కువైట్: ప్రస్తుత వేసవి సెలవుల సమయంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 5,570,000 మంది ప్రయాణికులను ఆశిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.  ఇది జూన్ ప్రారంభం నుండి సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఈ కాలంలో దాదాపు 42,117 విమానాలు నడపనున్నట్లు ఏవియేషన్ సేఫ్టీ, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మరియు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోసం తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు. ఇందులో మాలాగా, ట్రాబ్జోన్, సరజెవో, బోడ్రమ్, నైస్, షర్మ్ ఎల్-షేక్, వియన్నా, సలాలా, అంటాల్యా మరియు పోలాండ్‌లోని క్రాకో వంటి కొన్ని కాలానుగుణ గమ్యస్థానాలకు సేవలు ఉన్నాయని పేర్కొన్నారు. దుబాయ్, కైరో, జెద్దా, ఇస్తాంబుల్ మరియు దోహా అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానాలుగా నిలిచాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com