కళావతికి ఏమయ్యింది.? కీర్తి సురేష్ జోరు తగ్గిందెందుకు.?
- May 11, 2022
‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్‌కి దగ్గరైంది. మరికొన్ని గంటల్లోనే సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మరింత వేగవంతం చసింది చిత్ర యూనిట్. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే ఆయన ముద్దుల తనయ సితార కూడా ప్రమోషన్లలో హుషారుగా కనిపిస్తున్నారు.
అయితే, హీరోయిన్ కీర్తి సురేష్ సంగతేంటీ.? హీరోగారు, డైరెక్టర్ గారు మాత్రమే ప్రమోషన్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. హీరోయిన్ మాత్రం మొదట్లో ఏవో ఒకటి రెండు ఇంటర్వ్యూలిచ్చి సైడైపోయింది. ఎందుకలా.? కీర్తి సురేష్ ఎందుకు సైలెంట్ అయిపోయింది.? అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కీర్తి సురేష్ నటించిన ‘చిన్ని’ సినిమా ఓటీటీలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కీర్తి సురేష్‌లోని నటికి ఈ సినిమాలోని చిన్ని పాత్ర సవాల్ విసిరేలా వుందంటూ సినీ మేథావులు కీర్తి సురేష్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు.
ఈ పాజిటివిటీ ‘సర్కారు వారి పాట’ సినిమాకి సైతం ప్లస్ పాయింట్ అవుతుందనడం అతిశయోక్తి కాదు. కానీ, కీర్తి సురేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా పబ్లిసిటీకి ఎందుకు రావడం లేదు. ‘కళావతి..’ పాటతో కీర్తి సురేష్ గ్లామర్ పరంగా దక్కిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.
ఈ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలి కదా.. మహానటి. మరి ఎందుకు ఇంత సైలెన్స్ వహిస్తోంది.? ఏమో మహానటికే తెలియాలి మరి. అఫ్కోర్స్.. సినిమా హిట్టయితే, ఇలాంటివన్నీ ఆటోమెటిగ్గా కొట్టుకుపోతాయనుకోండి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







